Wednesday, May 23, 2018

సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ కుమారుడి హఠాన్మరణం!!! 


కుమారుడు వైష్ణవ్ తో ఎంపీ దత్తాత్రేయ 

కేంద్ర మాజీ మంత్రి సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ ఏకైక కుమారుడు వైష్ణవ్ (21) హఠాన్మరణం చెందారు. గతరాత్రి భోజనం చేసే సమయం లో అకస్మాత్తుగా గుండెపోటు రావడం తో దగ్గర లోని ముషీరాబాద్ గురునానక్ కేర్ హాస్పిటల్లో చేర్పించారు. తీవ్రంగా శ్రమించిన వైద్యులు రాత్రి 12 గంటలకు చనిపోయాడని ప్రకటించారు. 
ఈ  సంఘటనతో  దత్తాత్రేయ ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. విషయం తెలుసుకున్న వివిధ పార్టీల నాయకులూ మిత్రులు అభిమానులు దత్తాత్రేయని పరామర్శిస్తున్నారు 

No comments:

Post a Comment