సంక్షోభం లో జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం, గవర్నర్ పాలనకు రాష్ట్రపతి ఆమోదం
● పీడీపీ కి మద్దతు ఉపసంహరించిన బీజేపీ
● సీఎం ముఫ్తి రాజీనామా
● గవర్నర్ పాలనలో జమ్మూ కాశ్మీర్
జమ్మూ కాశ్మీర్ లో ని ప్రభుత్వం పీడీపీ, బీజేపీ మద్దతుతో ఉంది. అయితే అకస్మాత్తుగా బీజేపీ తమ మద్దతు ఉపసంహరించటంతో ప్రభుత్వం పడిపోయింది. జమ్మూ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి తన పదవికి రాజీనామా చేసారు.
జమ్మూకాశ్మీర్ కాల్పులు, హింస, ఉగ్రవాదం లాంటి అంశాలలో ఇరు పార్టీల మధ్య భేదాభిప్రాయాలు రావటంతో బీజేపీ తన మద్దతు ఉపసంహరించింది
దీంతో రాష్టంలో వేరే పార్టీ మద్దతు కు ముందుకు రాకపోవడంతో రాష్ట్రపతి పాలనా అనివార్యం ఐంది. గవర్నర్ పాలనకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
No comments:
Post a Comment